Share News

ఎన్‌సీఎల్‌ఏటీ చైర్మన్‌ ముందుకు ఐవీఆర్‌సీఎల్‌ దివాలా కేసు

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:24 AM

హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) సంస్థ ఐవీఆర్‌సీఎల్‌ లిమిటెడ్‌ దివాలా కేసు ఇంకా కొనసాగుతోంది. ఈ కంపెనీని రూ.1,200 కోట్లకు కొనుగోలు...

ఎన్‌సీఎల్‌ఏటీ చైర్మన్‌ ముందుకు ఐవీఆర్‌సీఎల్‌ దివాలా కేసు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) సంస్థ ఐవీఆర్‌సీఎల్‌ లిమిటెడ్‌ దివాలా కేసు ఇంకా కొనసాగుతోంది. ఈ కంపెనీని రూ.1,200 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన రాఘవ స్క్వేర్‌ అనే కంపెనీ ఆర్థిక సత్తా పైనా అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఇందుకోసం ఈ కంపెనీ ఇప్పటి వరకు రూ.150 కోట్లు మాత్రమే డిపాజిట్‌ చేసింది. గడువు తీరినా మిగతా రూ.1,050 కోట్లు చెల్లించలేదు. దీంతో కంపెనీ లిక్విడేటర్‌ ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని సవాల్‌ చేస్తూ రాఘవ స్క్వేర్‌.. నేషనల్‌ కంపెనీ లా అప్పిల్లేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) చెన్నై బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ బెంచ్‌లోని ఇద్దరు సభ్యులూ చెరో అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఈ విషయం ఎన్‌సీఎల్‌ఏటీ చైర్మన్‌ ముందుకు చేరింది. 2017 ఆగస్టులో ప్రారంభమైన ఐవీఆర్‌సీఎల్‌ దివాలా ప్రక్రియ ఇంత వరకు కొలిక్కి రాలేదు.

ఈ వార్తలు కూడా చదవండి...

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Jun 10 , 2026 | 03:24 AM