Share News

ఐటీసీ లాభం రూ.5,469 కోట్లు

ABN , Publish Date - May 22 , 2026 | 02:43 AM

ఐటీసీ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.5,469.74 కోట నికర లాభాన్ని...

 ఐటీసీ లాభం రూ.5,469 కోట్లు

న్యూఢిల్లీ: ఐటీసీ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.5,469.74 కోట నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి కంపెనీ రూ.19,807.88 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని ఆర్జించింది. మార్చి త్రైమాసికంలో రాబడి రూ.23,625.69 కోట్లుగా ఉంది. గతేడాది పూర్తి అనుబంధ సంస్థలైన విమ్కో, శ్రేష్ఠ నేచురల్‌ బయోప్రొడక్ట్స్‌ కంపెనీలో విలీనం పూర్తయిన కారణంగా ఆర్థిక ఫలితాలు పోల్చదగినవి కావని కంపెనీ పేర్కొంది. కాగా ఒక్కో షేరుకు కంపెనీ బోర్డు రూ.8 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - May 22 , 2026 | 02:43 AM