తగ్గిన ఇండిగో నష్టాలు
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:47 AM
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,879.1 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది...
క్యూ2లో రూ.1,879 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,879.1 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. విమాన ఇంధన ధరలు భారీగా పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కంపెనీ లాభదాయకతను దెబ్బతీశాయని సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నష్టాలు రూ.2,582.10 కోట్లుగా ఉన్నాయి. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.19,599.5 కోట్ల నుంచి రూ.24,311.9 కోట్లకు పెరిగింది. మొత్తం ఖర్చులు రూ. 26,188.4 కోట్లకు చేరుకోగా.. ఇందులో ఇంధన వ్యయాలు 67.2 శాతం పెరిగి రూ. 9,966.8 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు విమాన ప్రయాణికుల సంఖ్య 4.7 శాతం తగ్గడం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు