సవాళ్లు తాత్కాలికమే..
ABN , Publish Date - Jun 05 , 2026 | 03:50 AM
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, వడ్డీ రేట్లపై ఆందోళనల వంటి స్వల్పకాలిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారత దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం ఏ మాత్రం తగ్గలేదని గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం...
భారత వృద్ధికి ఢోకా లేదు
సిటీ సీఈఓ జెన్ ఫ్రేజర్
ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, వడ్డీ రేట్లపై ఆందోళనల వంటి స్వల్పకాలిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారత దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం ఏ మాత్రం తగ్గలేదని గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ సీఈఓ జెన్ ఫ్రేజర్ అన్నారు. భారత వృద్ధికి ఢోకా లేదని, తాత్కాలిక ప్రతికూల పరిస్థితుల ఆధారంగా వృద్ధి అవకాశాలను తక్కువ అంచనా వేయకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తన స్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. విఽధానపరమైన సంస్కరణలు, డిజిటలీకరణ, సాంకేతిక ప్రతిభ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తులుగా నిలుస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, వ్యాపార అనూకూల విధానాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని పేర్కొన్నారు. డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ, డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులు, విస్తృత ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్మార్ట్ ఫోన్ వినియోగం శరవేగంగా విస్తరించడంతో ప్రపంచంలోనే అత్యంత అనుసంధానిత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచిందని ఫ్రేజర్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
Read Latest National News And Telugu News