Share News

స్టాక్‌మార్కెట్లకు చమురు సెగ.. సెన్సెక్స్ 2200 పాయింట్లు డౌన్..

ABN , Publish Date - Mar 09 , 2026 | 10:18 AM

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి.

స్టాక్‌మార్కెట్లకు చమురు సెగ.. సెన్సెక్స్ 2200 పాయింట్లు డౌన్..
Stock Market

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉండడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి భారీగా పతనమవడం దేశీయ సూచీలపై నెగిటివ్‌ ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (78,918)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 2000 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పతనమైంది. మరో ఆరు వందల పాయింట్లు కిందకు వెళ్లింది. చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ 70,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 2037 పాయింట్ల నష్టంతో 76,881 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది. 2.5 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం 624 పాయింట్ల నష్టంతో 23,826 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో ఎమ్‌సీఎక్స్ ఇండియా, కోల్ ఇండియా మొదలైన షేర్లు మాత్రమే స్వల్ప లాభాల్లో ఉన్నాయి (share market news). ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, యూనో మిండా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, హిందుస్థాన్ పెట్రో మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1587 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 2280 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.32గా ఉంది.


ఇవి కూడా చదవండి..

ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..


మరింత తగ్గాయ్.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 09 , 2026 | 10:19 AM