కోలుకున్న సూచీలు.. 390 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:55 PM
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కోలుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.35) బలపడింది.
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కోలుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.35) బలపడింది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్‌లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (73,524)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొంది. మధ్యాహ్నం సమయంలో నష్టాల్లోకి జారుకుంది. అయితే చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరకు సెన్సెక్స్ 394 పాయింట్ల లాభంతో 73,918 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 119 పాయింట్ల లాభంతో 23,242 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో పీఐ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మోతీలాల్ ఓస్వాల్, ఆర్బీఎల్ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఓఎన్‌జీసీ, టైటాన్ కంపెనీ, ఎన్‌టీపీసీ, వొడాఫోన్ ఐడియా, ఇన్ఫోఎడ్జ్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1130 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 809 పాయింట్లు ఆర్జించింది.
ఇవి కూడా చదవండి..
డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును 50 ఏళ్లకు పొడిగించే అవకాశం..
యాపిల్ ఐఓఎస్ 27లో అదిరిపోయే ఫీచర్లు.. ఏయే ఫోన్లకు అందుబాటులోకి వస్తుందంటే..