Share News

నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్..

ABN , Publish Date - Jul 09 , 2026 | 10:00 AM

బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు మొగ్గుచూపడంతో సూచీలు లాభాల బాట పట్టాయి.

నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్..
Stock Market

బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు మొగ్గుచూపడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. వరుసగా ఆరో రోజైన బుధవారం కూడా విదేశీ మదుపర్లు రూ.1963 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సానుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.55గా ఉంది (Indian stock market).


గత సెషన్ ముగింపు (76,503)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత భారీగా పుంజుకుంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 548 పాయింట్ల లాభంతో 77,052 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 172 పాయింట్ల లాభంతో 24,054 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో కల్యాణ్ జువెల్లర్స్, స్విగ్గీ, డిక్సన్ టెక్నాలజీస్, ఎటర్నల్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఇన్ఫోసిస్, నాల్కో, పాలీక్యాబ్, సోలార్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 540 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 719 పాయింట్ల లాభంతో ఉంది.


ఇవి కూడా చదవండి..

మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..


మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 09 , 2026 | 10:04 AM