లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Feb 09 , 2026 | 10:15 AM
అమెరికాతో ట్రేడ్ డీల్ అమలులో వేగంగా అడుగులు పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి లాభాలను ఆర్జించడం బ్యాంకింగ్ సెక్టార్‌లో జోష్ నింపింది.
అమెరికాతో ట్రేడ్ డీల్ అమలులో వేగంగా అడుగులు పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి లాభాలను ఆర్జించడం బ్యాంకింగ్ సెక్టార్‌లో జోష్ నింపింది. అలాగే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో పెట్టుబడిదారులు ఆసక్తిచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (83,580)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. ఏడు వందల పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ఆ తర్వాత కాస్త కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 349 పాయింట్ల లాభంతో 83,928 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 111 పాయింట్ల లాభంతో 25,805 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్ కంపెనీ, కోటక్ మహీంద్రా, టాటా స్టీల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 554 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 553 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.56గా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..