మెటల్, రియాల్టీ రంగాల్లో అమ్మకాలు.. నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు..
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:11 PM
సోమవారం లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ 600 పాయింట్ల దిగువన క్లోజ్ అయింది. ముఖ్యంగా మెటల్, రియాల్టీ రంగాల్లో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగాయి.
సోమవారం లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ 600 పాయింట్ల దిగువన క్లోజ్ అయింది. ముఖ్యంగా మెటల్, రియాల్టీ రంగాల్లో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం కూడా ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి. కాగా, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.96) మారకం విలువ బలపడింది (Indian stock market).
గత సెషన్ ముగింపు (78,285)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం సమయంలో మరింత పైకి వెళ్లింది. అయితే చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో చివరకు సెన్సెక్స్ 104 పాయింట్ల నష్టంతో 78,180 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 31 పాయింట్ల నష్టంతో 24,398 వద్ద రోజును ముగించింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ఇన్ఫోఎడ్జ్, స్విగ్గీ, జుబిలెంట్ ఫుడ్స్, హవెల్స్ ఇండియా, పెర్సిస్టెంట్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ట్రెంట్, కల్యాణ్ జువెల్లర్స్, బయోకాన్, కొచిన్ షిప్‌యార్డ్, లారస్ ల్యాబ్స్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 186 పాయింట్ల నష్టపోయింది.
ఇవి కూడా చదవండి..
శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు