Stock Market: వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jan 07 , 2026 | 10:40 AM
వెనెజువెలా, ఇరాన్‌లోని ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటలోనే సాగుతున్నాయి. దేశీయ సూచీలు కూడా అదే బాటలో సాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.
విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. విదేశీ మదుపర్లు మంగళవారం 107 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. వెనెజువెలా, ఇరాన్‌లోని ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటలోనే సాగుతున్నాయి. దేశీయ సూచీలు కూడా అదే బాటలో సాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 063)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 400 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. అయినప్పటికీ చాలా రోజుల తర్వాత 85 వేల మార్క్ దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో 175 పాయింట్ల నష్టాలతో 84, 889 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 47 పాయింట్ల నష్టంతో 26, 131 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో టాటా టెక్, కేపీఐటీ టెక్నాలజీస్, టైటాన్ కంపెనీ, టాటా ఎలాక్సీ, లూపిన్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఇండియన్ హోటల్స్, సిప్లా, టీఎమ్‌పీవీ, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, నైకా మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 189 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.92గా ఉంది.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..