Share News

Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Jan 06 , 2026 | 10:02 AM

ఎఫ్‌ఎమ్‌సీజీ రంగం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండడంతో పాటు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ సూచీలు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. దీంతో సోమవారం నష్టాలనే చవిచూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.

Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

ఎఫ్‌ఎమ్‌సీజీ రంగం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండడంతో పాటు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ సూచీలు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. దీంతో సోమవారం నష్టాలనే చవిచూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. మరో వైపు బ్యాంకింగ్ రంగం మాత్రం లాభాలతో రాణిస్తోంది. హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (85, 439)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం వంద పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా కోల్పోయి 85, 007 వద్దకు చేరింది. ఆ తర్వాత కాస్త కోలుకుని ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో 130 పాయింట్ల నష్టాలతో 85, 309 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 26, 237 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌లో నాల్కో, ఐఐఎఫ్‌ఎల్, హిందాల్కో, ఎమ్‌సీఎక్స్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ట్రెంట్, రిలయన్స్, డాబర్ ఇండియా, టీఎమ్‌పీవీ, సోనా బీఎల్‌డబ్ల్యూ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 61 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 193 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.10గా ఉంది.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..


వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా సత్యసాయి బాబా భక్తురాలు..

Updated Date - Jan 06 , 2026 | 10:02 AM