స్టాక్ మార్కెట్లకు ఉపశమనం.. వరుస నష్టాలకు బ్రేక్..
ABN , Publish Date - Mar 05 , 2026 | 03:38 PM
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ కాస్త వెనక్కి తగ్గినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మాట్లాడడం సూచీలపై పాజిటివ్ ప్రభావాన్ని చూపింది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ కాస్త వెనక్కి తగ్గినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మాట్లాడడం సూచీలపై పాజిటివ్ ప్రభావాన్ని చూపింది. అలాగే కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, అంతర్జాతీయంగా కొన్ని సానుకూల సంకేతాలు సూచీలను లాభాల వైపు నడిపించాయి. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కాస్తంత కోలుకుంది. అలాగే ఆయిల్, గ్యాస్ రంగ స్టాక్స్‌లో కొనుగోళ్లు కూడా కలిసొచ్చాయి. చివరకు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (79,116)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 400 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. ఒక దశలో దాదాపు 1200 పాయింట్లు లాభపడి 80,303 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 811 పాయింట్ల లాభంతో 79,927 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 285 పాయింట్ల నష్టంతో 24,765 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో మాజగాన్ డాక్, నాల్కో, బ్లూ స్టార్, బీఎస్ లిమిటెడ్, పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఆయిల్ ఇండియా, కేపీఐటీ టెక్, ఎంఫసిస్, కోఫోర్జ్, పెర్సిస్టెంట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 867 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.60గా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య అమెరికా భారీ క్షిపణి పరీక్ష
కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన