లాభాల స్వీకరణ.. నష్టాల్లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - Feb 05 , 2026 | 10:35 AM
అమెరికా ట్రేడ్ డీల్ కారణంగా గత మూడు సెషన్లుగా లాభపడుతూ వచ్చిన దేశీయ సూచీలు గురువారం నష్టాల బాట పట్టాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో చలిస్తున్నాయి. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
అమెరికా ట్రేడ్ డీల్ కారణంగా గత మూడు సెషన్లుగా లాభపడుతూ వచ్చిన దేశీయ సూచీలు గురువారం నష్టాల బాట పట్టాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో చలిస్తున్నాయి. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా మెటల్ ధరలు పడిపోవడవంతో ఆ సెక్టార్ దాదాపు రెండు శాతం నష్టపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల వల్ల కూడా ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ఉన్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (83,817)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో ఐదు వందల పాయింట్లకు పైగా కోల్పోయింది. అయితే కాసేపటికి భారీ నష్టాల నుంచి కోలుకుంది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 331 పాయింట్ల నష్టంతో 83,486 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 118 పాయింట్ల నష్టంతో 25,651 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో బజాజ్ హోల్డింగ్స్, నైకా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, జుబిలెంట్ ఫుడ్స్, యూనియన్ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హిందుస్థాన్ జింక్, వేదాంత, కేన్స్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 387 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.41గా ఉంది.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..