స్టాక్‌మార్కెట్ క్రాష్.. సెన్సెక్స్ 1700 పాయింట్లు డౌన్..
ABN , Publish Date - Mar 04 , 2026 | 09:40 AM
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం మనదేశంపై తీవ్రంగా ఉంటుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం మనదేశంపై తీవ్రంగా ఉంటుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ మరింత పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (80,238)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 1700 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ మదుపర్లకు షాకిచ్చింది. చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ 78,500 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 1726 పాయింట్ల నష్టంతో 78,511 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది. రెండు శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం 534 పాయింట్ల నష్టంతో 24,331 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో సోలార్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, నాల్కో, పీబీ ఫిన్‌టెక్ మొదలైన షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి (share market news). పెట్రొనాట్ ఎల్‌ఎన్‌జీ, లార్సన్, సెయిల్, టాటా స్టీల్, మదర్సన్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1260పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 1155 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.16గా ఉంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
వామ్మో.. క్రీమ్ రోల్స్‌ను ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. తినడానికే భయపడతారేమో..