అమెరికాతో ట్రేడ్ డీల్.. ఫుల్ జోష్‌లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - Feb 03 , 2026 | 09:48 AM
అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడం దేశీయ సూచీలకు భారీ లాభాలను అందిస్తోంది. భారత్ ఎగుమతులపై పన్నులు భారీగా తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు రూపాయి కూడా బలపడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంపై అమెరికా 20 శాతం సుంకాలు వసూలు చేస్తోంది.
అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడం దేశీయ సూచీలకు భారీ లాభాలను అందిస్తోంది. భారత్ ఎగుమతులపై పన్నులు భారీగా తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంపై అమెరికా 20 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. తాజాగా భారత్‌పై సుంకాలను 50 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో భారత్ పైనే అమెరికా సుంకాలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు రూపాయి కూడా బలపడుతోంది. ఈ పరిణామాలతో ఈ రోజు సెన్సెక్స్ 3500 పాయింట్ల లాభంతో మొదలైంది. మరోవైపు నిఫ్టీ కూడా జోరు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా నేల చూపులు చూసిన సూచీలు భారీగా లాభపడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (81,666)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 3500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ జోరు చూపిస్తోంది. చాలా రోజుల తర్వాత 85 వేల మార్క్ దాటింది. అయితే ఆ తర్వాత అమ్మకాల కారణంగా కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 2143 పాయింట్ల లాభంతో 83,809 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 649 పాయింట్ల లాభంతో 25,737 వద్ద కదలాడుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే కదలాడుతున్నాయి (stock market news today).
సెన్సెక్స్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కేఈఐ ఇండస్ట్రీస్, సీజీ పవర్, అదానీ ఎనర్జీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). పీబీ ఫిన్‌టెక్, ఓఎన్‌జీసీ, గోద్రేజ్ కన్జ్యూమర్, నెస్ట్లే, ఆయిల్ ఇండియా మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1561 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 13528 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.36గా ఉంది.
ఇవి కూడా చదవండి..
హాస్పిటల్‌లో కాబోయే భర్త.. పెళ్లి కూతురి ఏడుపు.. పోలీసులు విచారణ చేస్తే..
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..