తగ్గిన ముడి చమురు ధరలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - May 25 , 2026 | 10:31 AM
ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం సూచీలకు సానుకూలంగా మారింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి వంద డాలర్ల దిగువకు వచ్చేసింది.
ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం సూచీలకు సానుకూలంగా మారింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి వంద డాలర్ల దిగువకు వచ్చేసింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.34) బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా లాభాలు ఆర్జిస్తున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (75,415)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 700 పాయింట్ల లాభంతో 76,135 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 906 పాయింట్ల లాభంతో 76,310 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 251 పాయింట్ల లాభంతో 23,971 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో గెయిల్, ఎయిచర్ మోటార్స్, హిందుస్థాన్ పెట్రో, ఐనాక్స్ విండ్, బీపీసీఎల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఇన్ఫో ఎడ్జ్, కోల్గేట్, ఆయిల్ ఇండియా, మ్యాక్స్ హెల్త్‌కేర్, నైకా మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 884 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 528 పాయింట్ల లాభంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..