దిగి వచ్చిన ముడి చమురు ధరలు.. సూచీలకు భారీ లాభాలు..
ABN , Publish Date - Jul 27 , 2026 | 09:44 AM
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4.3 శాతం తగ్గి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4.3 శాతం తగ్గి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు బ్యాంకింగ్ సెక్టార్, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.24) బలపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,059)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 600 పాయిట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ అదే జోరు కొనసాగిస్తోంది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 76,687 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 176 పాయింట్ల లాభంతో 23,943 వద్ద ఉంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, కేఫిన్ టెక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, లారస్ ల్యాబ్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మోతీలాల్ ఓస్వాల్, పేటీఎమ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 488 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 667 పాయింట్ల లాభంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
బెర్లిన్ ప్రైడ్ వేడుకపై ఉగ్రదాడి.. ఇస్లామిక్ తీవ్రవాద కోణంలో జర్మనీ దర్యాప్తు..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..