Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:21 AM
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం కూడా స్టాక్‌మార్కెట్ల నష్టానికి ఒక కారణంగా మారింది. మరోవైపు ఐటీ, మెటల్ రంగ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.
సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడి బెదిరింపులు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం కూడా స్టాక్‌మార్కెట్ల నష్టానికి ఒక కారణంగా మారింది. మరోవైపు ఐటీ, మెటల్ రంగ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (83, 576)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 150 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్ల నష్టంతో 83, 138 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 126 పాయింట్ల నష్టంతో 25, 556 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో మణప్పురం ఫైనాన్స్, ఇండియన్ రెన్యుబుల్, బీఎస్‌ఈ లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, కోల్ ఇండియా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). హిటాచీ ఎనర్జీ, భెల్, దివీస్ ల్యాబ్స్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్, లారస్ ల్యాబ్స్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 352 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.24గా ఉంది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మూడు పాములతో హాస్పిటల్‌కు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..