Share News

కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Feb 10 , 2026 | 10:30 AM

అమెరికా‌తో ట్రేడ్ డీల్ భారత సూచీల్లో భారీగా జోష్ నింపింది. దేశీయ సూచీలు వరుసగా లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోవైపు పలు సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడం కూడా మదుపర్లలో సానుకూల ప్రభావాన్ని నింపుతోంది.

కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

అమెరికా‌తో ట్రేడ్ డీల్ దేశీయ సూచీల్లో భారీగా జోష్ నింపుతోంది. స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోవైపు పలు సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడం కూడా మదుపర్లలో సానుకూల ప్రభావాన్ని నింపుతోంది. ఇటీవలి నష్టాల నేపథ్యంలో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో పెట్టుబడిదారులు ఆసక్తిచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (84,065)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. మూడు వందల పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 259 పాయింట్ల లాభంతో 84,325 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 67 పాయింట్ల లాభంతో 25,934 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌లో ఎటర్నల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజికీ, టైటాన్ కంపెనీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 168 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 12 పాయింట్ల స్వల్ప నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.69గా ఉంది.


Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 10 , 2026 | 10:30 AM