ఈసారి 9.1 శాతం వేతన వృద్ధి
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:18 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉద్యోగుల వేతనాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏయాన్...
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉద్యోగుల వేతనాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏయాన్ వెల్లడించింది. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సవాళ్లు నెలకొన్నప్పటికీ.. దేశీయ వినియోగం, పెట్టుబడులు, ఎగుమతుల వృద్ధి కారణంగా సంస్థలు ఉద్యోగుల వేతనాల పెంపును కొనసాగించవచ్చని తాజా నివేదికలో తెలిపింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రంగంలో అత్యధికంగా 10.1 శాతం పెరిగే అవకాశముందని తెలిపింది. ఇంధన రంగంలో 9.9 శాతం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో 9.8 శాతం చొప్పున వేతనాల వృద్ధి నమోదుకావొచ్చని అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి
పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ