Share News

4,000 ఎకరాలు.. రూ.73,000 కోట్లు

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:17 AM

ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు గృహ, వాణిజ్య సముదా య ప్రాజెక్టుల నిర్మాణం కోసం సుమారు రూ.18,000 కోట్లు వెచ్చించి దాదాపు 900 ఎకరాల భూమిని...

4,000 ఎకరాలు.. రూ.73,000 కోట్లు

2025 నుంచి రియల్టీ సంస్థలు కొనుగోలు చేసిన భూమి

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు గృహ, వాణిజ్య సముదా య ప్రాజెక్టుల నిర్మాణం కోసం సుమారు రూ.18,000 కోట్లు వెచ్చించి దాదాపు 900 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సేవల కంపెనీ జేఎల్‌ఎల్‌ ఇండియా వెల్లడించింది. గత ఏడాదిలో రియల్టీ డెవలపర్లు భారీగా భూములు కొనుగోలు చేశారని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ అదే జోరును కొనసాగించారని బుధవారం విడుదల చేసిన నివేదికలో కంపెనీ పేర్కొంది. 2025లో రియల్టీ సంస్థలు 149 లావాదేవీల ద్వారా 3,093 ఎకరాలకు పైగా భూమిని రూ.54,818 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే, 2025 జనవరి నుంచి 2026 మార్చి మధ్యకాలంలో ఆ సంస్థలు 3,993 ఎకరాల భూమిని మొత్తం రూ.72,818 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లావాదేవీలన్నీ ప్రధాన, ద్వితీయ శ్రేణి నగరాల్లోనే జరిగాయని పేర్కొంది.

  • విలువపరంగా దేశంలో అతిపెద్ద ల్యాండ్‌ డీల్‌ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ముంబైలో నమోదైంది. 11 ఎకరాల భూమి రూ.5,400 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే, ఎకరా రూ.490 కోట్లు పలికింది.

  • రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు కొనుగోలు చేసిన ఈ భూముల్లో ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.52,000 వరకు రుణాలు సమీకరించాల్సిరావచ్చని జేఎల్‌ఎల్‌ అంచనా. అయితే, నియంత్రణాపరమైన అవరోధాలు, రిస్క్‌ కారణంగా బ్యాంక్‌లు అంతపెద్ద మొత్తంలో రుణాలు సమకూర్చలేకపోవచ్చని.. దాంతో డెవలపర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్‌), ప్రైవేట్‌ క్రెడిట్‌ను ఆశ్రయించవచ్చని సంస్థ పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 05:17 AM