Share News

పశ్చిమాసియా సంక్షోభం ఫార్మా ఎగుమతులపై ఉండదు

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:31 AM

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత ఫార్మా ఎగుమతులపై పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలతో 2025 -26 ఆర్థిక సంవత్సరంతో...

పశ్చిమాసియా సంక్షోభం  ఫార్మా ఎగుమతులపై ఉండదు

ఉపశమన చర్యల పొడిగింపు!

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ

డిప్యూటీ డైరెక్టర్‌ రవి తేజ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత ఫార్మా ఎగుమతులపై పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలతో 2025 -26 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఫార్మా ఎగుమతులు పరిమాణపరంగా మరింత పెరుగుతాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రవి తేజ చెప్పారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఫార్మా ఎగుమతులపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఫార్మా పరిశ్రమకు అవసరమైన కీలక ముడి పదార్ధాలపై దిగుమతి సుంకాల రద్దు వంటి అనేక చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెలాఖరుతో ముగిసే ఈ ఉపశమన చర్యలను అవసరాన్ని బట్టి మరికొంత కాలం కొనసాగించే అవకాశం ఉందన్నారు. అమెరికా, యూర ప్‌తో పాటు మధ్య ఆసియా, ఆఫ్రికా, రష్యా దేశాలకు కూడా మన ఫార్మా ఎగుమతులు పెంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు రవి తేజ తెలిపారు.

ఎగుమతులు భళా

కొన్ని ఇబ్బందులు ఉన్నా గత 12 సంవత్సరాల్లో మన దేశం నుంచి ఫార్మా ఎగుమతులు గణనీయగా పెరిగినట్టు రవితేజ చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,400 కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2025-26) 7.2 శాతం వృద్ధి రేటుతో 3,100 కోట్ల డాలర్లకు చేరిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ లెక్కన 2030 నాటికి 5,000 కోట్ల డాలర్ల ఫార్మా ఎగుమతుల లక్ష్య సాధన పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రపంచ జెనరిక్‌ ఔషధాల్లో 20 శాతం మన దేశం నుంచే సరఫరా అవుతున్న విషయాన్ని రవి తేజ గుర్తు చేశారు.

చిన్న కంపెనీలకు అండ

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎగుమతుల రంగంలో ఉన్న ఫార్మా రంగానికి చెందిన చిన్న, మధ్య తరహా కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవి తేజ చెప్పారు. ఇందులో భాగంగా ఈ సంస్థలు.. విదేశీ రెగ్యులేటరీ సంస్థల వద్ద రిజిస్ట్రేషన్‌, ఇన్‌స్పెక్షన్‌ కోసం చేసే ఖర్చుల్లో సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Jun 10 , 2026 | 03:31 AM