Share News

భారత జీడీపీ అంచనాలు అదుర్స్‌

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:46 AM

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అమెరికా-ఇరాన్‌ మధ్య రాజుకున్న యుద్ధం ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. దీంతో...

భారత జీడీపీ అంచనాలు అదుర్స్‌

7.1% వరకు వృద్ధి రేటు

ఓఈసీడీ, ఏడీబీ, ఎస్‌ అండ్‌ పీ, ఫిచ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అమెరికా-ఇరాన్‌ మధ్య రాజుకున్న యుద్ధం ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. దీంతో ముడి చమురు ధర పెరగటమే కాకుండా సరఫరాలకూ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మంచి జోరు మీద ఉందని నాలుగు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు బుధవారం విడివిడిగా విడుదల చేసిన నివేదికల్లో తెలిపాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఓఈసీడీ అనే సంస్థ 6.3 శాతం నుంచి ఏకంగా 7.1 శాతానికి పెంచేసింది. ఏడీబీ, ఎస్‌ అండ్‌ పీ సంస్థలూ తమ భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతం నుంచి 7 శాతానికి పెంచాయి. ఫిచ్‌ రేటింగ్‌ కూడా తన జీడీపీ అంచనాలను 6.4 శాతం నుంచి 6.9 శాతానికి అప్‌గ్రేడ్‌ చేసింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ కీలక రెపో రేటును మరో పావు శాతం (0.25ు) పెంచే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ రేటింగ్స్‌ అంచనా వేసింది.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 24 , 2026 | 04:46 AM