రెండో త్రైమాసికంలో 7.6 శాతం వృద్ధి: ఇండ్-రా
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:19 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికం (క్యూ2)లో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని...
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికం (క్యూ2)లో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని, ఇందుకు పెట్టుబడుల్లో వృద్ధి ప్రధాన చోదకం కానుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) గురువారం పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరం క్యూ2లో 8.1 శాతం వృద్ధి నమోదు కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రికార్డయింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు త్రైమాసికానికి తాజా అంచనాలు వెలువడ్డాయి. 2026-27 పూర్తి ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఇండ్-రా 7.1 శాతం నుంచి 7.2 శాతానికి పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 % వృద్ధిని సాధించింది.
ఇవి కూడా చదవండి..
అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..
అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..