జూన్‌లో రూ.3.88 లక్షల కోట్ల ఎగుమతులు
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:33 AM
మన దేశ ఎగుమతులు జూన్‌లో వార్షిక ప్రాతిపదికన 15.5 శాతం పెరిగి 4,041 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3.88 లక్షల కోట్లు) చేరుకున్నాయి. అయితే దిగుమతులు భారీగా...
15.5 శాతం వృద్ధి నమోదు
ఐదు నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: మన దేశ ఎగుమతులు జూన్‌లో వార్షిక ప్రాతిపదికన 15.5 శాతం పెరిగి 4,041 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3.88 లక్షల కోట్లు) చేరుకున్నాయి. అయితే దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు ఐదు నెలల గరిష్ఠ స్థాయిలో 3,043 కోట్ల డాలర్ల (రూ.2.92 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ నెలలో ముడి చమురు దిగుమతులు ఏకంగా 40 శాతం పెరిగి 1,932 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. జూన్‌లో దేశ మొత్తం దిగుమతులు దాదాపు 31 శాతం పెరిగి 7,084 కోట్ల డాలర్ల (6.80లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. జూన్ ప్రథమార్ధంలో చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 90 డాలర్ల స్థాయిలో ఉన్నాయి. ప్రధానంగా అధిక ముడి చమురు ధరల వల్ల వాణిజ్య లోటు పెరిగింది. జూన్‌లో ఎలక్ర్టానిక్స్ దిగుమతులు 58.77 శాతం పెరిగి 1,340 కోట్ల డాలర్లకు, మెషనరీ దిగుమతులు 30.9 శాతం పెరిగి 580 కోట్ల డాలర్లకు, బంగారం దిగుమతులు 7 శాతం పెరిగి దాదాపు 200 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News