జులైలో 7 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత కరెంట్ అకౌంట్ లోటు
ABN , Publish Date - Sep 15 , 2026 | 09:23 PM
ఆర్బీఐ జులై నెలలో దేశం నమోదు చేసిన కరెంట్ అకౌంట్ లోటు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గణంకాలను విడుదల చేసింది. జులైలో కరెంట్ అకౌంట్ లోటు 7 బిలియన్ డాలర్లకు ఎగబాకింది.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 15: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జులై నెలలో దేశం నమోదు చేసిన కరెంట్ అకౌంట్ లోటు (Current Account Deficit - CAD), బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (BoP) గణంకాలను విడుదల చేసింది.
కరెంట్ అకౌంట్ లోటు (CAD) పెరుగుదల: వస్తువుల దిగుమతులు వేగంగా పెరగడం వల్ల వర్తక లోటు (Merchandise Trade Deficit) ఎక్కువై జులైలో కరెంట్ అకౌంట్ లోటు 7 బిలియన్ డాలర్లకు ఎగబాకింది (గతేడాది ఇదే నెలలో ఇది 3.2 బిలియన్ డాలర్లు).
ఎగుమతులు, దిగుమతులు
వస్తువుల ఎగుమతులు 37.4 బిలియన్ డాలర్ల నుంచి 45.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు కూడా పెరిగి 65.6 బిలియన్ డాలర్ల నుంచి 76.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వస్తు వర్తక లోటు 31.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
సేవలు, నిధుల సానుకూలత: సేవల రంగంలో మిగులు పెరగడం (Net Services Receipts - $17.6 బిలియన్లు) విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సులు/బదిలీలు ($13.2 బిలియన్లు) పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరగకుండా కొంతవరకు కలసివచ్చింది.
మూలధన ఖాతా (Capital Account) మద్దతు: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI - $7.3 బిలియన్లు), పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (FPI - $4.1 బిలియన్లు) ఎన్నారై డిపాజిట్లు ($33.5 బిలియన్లు) భారీగా పెరగడంతో క్యాపిటల్ అకౌంట్‌లోకి నిధుల ప్రవాహం సానుకూలంగా ఉండి విదేశీ చెల్లింపుల సమతుల్యతకు దోహదపడింది.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News