Share News

చెన్నై ప్లాంట్‌ నుంచి రెండు కొత్త మోడళ్లు

ABN , Publish Date - Jun 05 , 2026 | 03:45 AM

ఈ ఏడాదిలో చెన్నైలోని తన తయారీ ప్లాంట్‌ నుంచి రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్టు హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా గురువారం ప్రకటించింది. వీటిలో ఒకటి తన తొలి మాస్‌ మార్కెట్‌ ఎలక్ర్టిక్‌ వెహికిల్‌...

చెన్నై ప్లాంట్‌ నుంచి రెండు కొత్త మోడళ్లు

హ్యుండయ్‌ మోటార్‌

చెన్నై: ఈ ఏడాదిలో చెన్నైలోని తన తయారీ ప్లాంట్‌ నుంచి రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్టు హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా గురువారం ప్రకటించింది. వీటిలో ఒకటి తన తొలి మాస్‌ మార్కెట్‌ ఎలక్ర్టిక్‌ వెహికిల్‌ (ఈవీ) కూడా ఉంటుందని తెలిపింది. తమిళనాడును దేశం లో తన ప్రధాన ఈవీ కేంద్రంగా మార్చడానికి కట్టుబడి ఉన్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే విద్యుత్‌ వాహనాలు, ఐసీఈ తయారీ కార్యకలాపాల్లో లోకలైజేషన్‌ను పెంపొందించడానికి కంపెనీ కట్టుబడి ఉంది. వచ్చే ఐదు నుంచి ఆరేళ్లలో లోకలైజేషన్‌ను ప్రస్తుతమున్న 82 శాతం నుంచి 90 శాతానికి పెంచాలని కంపెనీ యోచిస్తోంది.

20ు మార్కెట్‌ వాటా టార్గెట్‌: టాటా మోటార్స్‌

భారత ఆటోమొబైల్‌ పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉందని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. 2030 నాటికి ఈ పరిశ్రమ 60 లక్షల వాహనాల స్థాయికి చేరుకుంటే.. అందులో 20 శాతానికి పైగా మార్కెట్‌ వాటాను కంపెనీ లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి

ప్రతి ఒక్కరూ రేపు సైకిల్‌ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు

Read Latest National News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 03:45 AM