Telangana Fish Farming: హైదరాబాద్‌లో రెయిన్‌బో జెల్ల చేపల ఉత్పత్తి కేంద్రం
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:31 AM
శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగే రెయిన్‌బో ట్రౌట్ (ఇంద్రధనుస్సు జెల్ల) చేపల ఉత్పత్తికి తెలంగాణ సిద్ధమవుతోంది. ఈ చేప పిల్లల ఉత్పత్తి కోసం స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ లిమిటెడ్ సంస్థ...
న్యూఢిల్లీ: శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగే రెయిన్‌బో ట్రౌట్ (ఇంద్రధనుస్సు జెల్ల) చేపల ఉత్పత్తికి తెలంగాణ సిద్ధమవుతోంది. ఈ చేప పిల్లల ఉత్పత్తి కోసం స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ లిమిటెడ్ సంస్థ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసింది. కేంద్ర మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. చర్మంపై ఇంద్రధనుస్సు ఆకారంలో మచ్చ ఉండడం ఈ జాతి జెల్లల ప్రత్యేకత. అధిక ధర ఉండే ఈ జెల్లలు శీతల ప్రాంతాల్లోని నదీ జలాలు, కాలువలు, సరస్సుల్లో మాత్రమే పెరుగుతాయి. మన దేశంలో హిమాలయాల ప్రాంతంలోని నదులు, కాలువలు, సరస్సుల్లో మాత్రమే ప్రస్తుతం ఇవి లభిస్తున్నాయి. ఉష్ఠ మండల ప్రాంతంలో నియంత్రిత ఉష్ణోగ్రతలతో వీటి పెంపకం కందుకూరు మండలంలోనే తొలిసారిగా ప్రారంభం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
For More TG News And Telugu News