Share News

ఐపీఓకి హిందుస్థాన్‌ కోకా-కోలా

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:06 AM

అంతర్జాతీయ బెవరేజ్‌ దిగ్గజం కోకా-కోలా కంపెనీ భారత అనుబంధ సంస్థ హిందుస్థాన్‌ కోకా-కోలా హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీసీహెచ్‌).. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది...

ఐపీఓకి హిందుస్థాన్‌ కోకా-కోలా

  • సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు

  • ఇష్యూ మొత్తం ఓఎఫ్ఎస్‌ రూపంలోనే

  • రూ.9,500 కోట్లు సమీకరించే అవకాశం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ బెవరేజ్‌ దిగ్గజం కోకా-కోలా కంపెనీ భారత అనుబంధ సంస్థ హిందుస్థాన్‌ కోకా-కోలా హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీసీహెచ్‌).. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) రూపంలోనే ఉండనుందని సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)లో హెచ్‌సీసీహెచ్‌ వెల్లడించింది. ఐపీఓ ద్వారా ప్రమోటర్‌ సంస్థ హిందుస్థాన్‌ ఓవర్సీస్‌ హోల్డింగ్స్‌ పీటీఈ లిమిటెడ్‌.. హెచ్‌సీసీహెచ్‌లో ఓఎఫ్ఎస్‌ ద్వారా రూ.10 ముఖ విలువతో కూడిన 99.75 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.9,500 కోట్లు సమీకరించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీఓతో సమీకరించిన మొత్తాలు పూర్తిగా మాతృసంస్థ ఖాతాలోకే వెళ్లనున్నాయి. హెచ్‌సీసీహెచ్‌లో కోకా-కోలా కంపెనీకి 60 శాతం వాటాలుండగా జుబిలెంట్‌ బెవరేజె్‌సకు 40 శాతం వాటా ఉంది. ఐపీఓ ద్వారా హెచ్‌సీసీహెచ్‌లో కోకా-కోలా వాటా 45 శాతానికి తగ్గుతుందని అంచనా. కాగా అసెట్‌ లైట్‌ వ్యూహంలో భాగంగా కోకో-కోలా కంపెనీ.. ఐపీఓ ద్వారా తన భారత సబ్సిడరీలో ఈ వాటాలను విక్రయిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.291 కోట్లు

ధనత్రయోదశి అదుర్స్‌

For More Business News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 04:06 AM