జీఎస్‌టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:07 AM
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు మే నెలలో రూ.1.94 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.88 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 3.2 శాతం...
మే నెలలో 3.2 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు మే నెలలో రూ.1.94 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.88 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 3.2 శాతం ఎక్కువ. రూ.27,281 కోట్ల రిఫండ్స్‌ను మినహాయించగా గత నెల జీఎస్‌టీ నికర ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.3 శాతం వృద్ధితో రూ.1.67 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, ఈ ఏప్రిల్‌లో జీఎ్‌సటీ స్థూల ఆదాయం ఆల్‌టైం రికార్డు గరిష్ఠ స్థాయి రూ.2.43 లక్షల కోట్లుగా నమోదైంది. దాంతో ఈ ఆర్థిక సంవత్సరం(2026-27)లో గడిచిన రెండు నెలలకు (ఏప్రిల్-మే) జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.4.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన ఆదాయంతో పోలిస్తే 6.2 శాతం అధికమిది.
ఏ ఖాతా కింద ఎంతంటే?
గత నెలలో సీజీఎస్‌టీ ద్వారా రూ.37,397 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ ద్వారా రూ.45,143 కోట్లు, ఐజీఎస్‌టీ ద్వారా రూ.51,990 కోట్లు సమకూరాయి. వీటికి తోడు దిగుమతులపై విధించే ఐజీఎస్‌టీ ద్వారా మరో రూ.59,654 కోట్ల ఆదాయం లభించింది.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం