Share News

హెల్త్‌కేర్‌, విద్యా రంగానికి రూ.2.28 కోట్ల నిధులు

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:00 AM

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఆరోగ్య, విద్యా రంగంలో సేవలందిస్తున్న సంస్థలకు రూ.2.28 కోట్ల నిధులను అందిస్తున్నట్లు...

హెల్త్‌కేర్‌, విద్యా రంగానికి రూ.2.28 కోట్ల నిధులు

జీఆర్‌టీ జువెలర్స్‌

హైదరాబాద్‌: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఆరోగ్య, విద్యా రంగంలో సేవలందిస్తున్న సంస్థలకు రూ.2.28 కోట్ల నిధులను అందిస్తున్నట్లు జీఆర్‌టీ జువెలర్స్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా తమిళనాడు కుంభకోణంలోని టౌన్‌ హైస్కూల్‌ లో పాఠశాల భవనం పునర్‌నిర్మాణంతో పాటు తరగతి గదుల నిర్మాణానికి రూ.95 లక్షలు, హెల్త్‌కేర్‌ రంగంలో సేవలందిస్తున్న అంబత్తూర్‌ కు చెందిన ఆనందం ట్రస్ట్‌కు రూ.25 లక్షలు, ట్యాంకర్‌ ఫౌండేషన్‌కు రూ.25 లక్షలతో పాటు దేశంలో అతిపెద్ద చారిటబుల్‌ సంస్థ అయిన ఆంధ్ర మహిళా సభకు రూ.83 లక్షల నిధులను అందించినట్లు జీఆర్‌టీ జువెలర్స్‌ వెల్లడించింది. ఈ సంస్థలు.. తమ హెల్త్‌కేర్‌ సేవలను మరింత పటిష్ఠం చేసేందుకు ఈ మొత్తాలను వినియోగించనున్నాయని పేర్కొంది. 1964లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి సామాజిక బాధ్యతలో భాగంగా పెద్దమొత్తంలో నిధులను కేటాయిస్తూ వస్తున్నట్లు జీఆర్‌టీ జువెలర్స్‌ ఎండీలు ఆనంద్‌ అనంత్‌ పద్మనాభన్‌, జీఆర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి రుణాలకు భలే గిరాకీ

అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు

For More Business News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 06:02 AM