Share News

ఐపీఓ ద్వారా రూ.60 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Sep 28 , 2026 | 02:29 AM

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉన్న అగ్రి ప్రాసెసింగ్‌ సంస్థ గ్రీన్‌ ఆసియా ఇంపెక్స్‌ లిమిటెడ్‌.....

ఐపీఓ ద్వారా రూ.60 కోట్ల సమీకరణ

గ్రీన్‌ ఆసియా ఇంపెక్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉన్న అగ్రి ప్రాసెసింగ్‌ సంస్థ గ్రీన్‌ ఆసియా ఇంపెక్స్‌ లిమిటెడ్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) సోమవారం ముగుస్తోంది. ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరను రూ.85-90గా ఖరారు చేసింది. ఈ ఎస్‌ఎంఈ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.60.01 కోట్లు సమీకరించనుంది. ఇందులో తాజా ఈక్వి టీ షేర్ల జారీ ద్వారా రూ.53.05 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా రూ.6.96 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల తో కొత్తగా సీఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయటంతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నట్లు వెల్లడించింది. కాగా కంపెనీ తన షేర్లను ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్‌లో నమోదు చేయనుంది.

ఈ వార్తలూ చదవండి

ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక

నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే

Updated Date - Sep 28 , 2026 | 02:29 AM