గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - May 30 , 2026 | 11:23 AM
దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా పడిపోయింది. పసిడి విక్రయాలు 70 శాతం తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా పడిపోయింది. పసిడి విక్రయాలు 70 శాతం తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న (శుక్రవారం) హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,57,640 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,44,500 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,18,230 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
ఈ రోజు (శనివారం) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 600.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 550 .. 18 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,57,040 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,950 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,780 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)
హైదరాబాద్: రూ.1,57,040
విజయవాడ: రూ.1,57,040
విశాఖపట్నం: రూ.1,57,040
ముంబై: రూ.1,57,040
బెంగళూరు: రూ.1,57,040
ఢిల్లీ: రూ.1,57,190
చెన్నై: రూ.1,59,600
సూరత్: రూ.1,57,190
మధురై: రూ.1,59,600
కోయంబత్తూరు: రూ.1,59,600
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి
నమ్మకంగా చేరి నట్టేట ముంచుతున్నారు!
రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..