పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే
ABN , Publish Date - Mar 11 , 2026 | 10:31 AM
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం పెరుగుదల నమోదు చేసిన బంగారం బుధవారం కూడా అదే బాటలో సాగుతోంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం పెరుగుదల నమోదు చేసిన బంగారం బుధవారం కూడా అదే బాటలో సాగుతోంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. (Gold prices).
ఈ రోజు (మార్చి 11న) ఉదయం 10:15 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,63,310కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.930 మేర పెరుగుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,700 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.850 మేర పెరిగింది.
మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.90 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..