స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు..
ABN , Publish Date - Feb 19 , 2026 | 06:55 AM
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భారీ పెరుగుదల తర్వాత గత రెండు వారాలుగా కనిపించిన తగ్గుదల ఇప్పుడు కనిపించడం లేదు. రెండు రోజులుగా బంగారం ధరలు దేశంలో దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 19: భారతదేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భారీ పెరుగుదల తర్వాత గత రెండు వారాలుగా కనిపించిన తగ్గుదల ఇప్పుడు కనిపించడం లేదు. రెండు రోజులుగా బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు భారతదేశంలో బంగారం ధర (ప్రధాన నగరాల ఆధారంగా) 24 క్యారెట్ గ్రాముకు రూ.15,419గా ఉంది. 22 క్యారెట్ బంగారం (1 గ్రాము) రూ.14,134గా.. 18 క్యారెట్ (1 గ్రాము) రూ.11,564గా ఉంది. ఇక 10 గ్రాములకు 24 క్యారెట్ రూ.1,54,190, 22 క్యారెట్ రూ.1,41,340 వద్ద కొనసాగుతోంది.
ఇక, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, జియోపొలిటికల్ టెన్షన్లు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. భారతదేశంలో వివాహాలు, పండుగలూ పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర (1 గ్రాము ) ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్, 22 క్యారెట్ ధరలు వరుసగా..
హైదరాబాద్ రూ.15,419(24 క్యారెట్), రూ.14,134(22 క్యారెట్)
విజయవాడ రూ.15,419, రూ.14,134
చెన్నై రూ.15,523, రూ.14,229
బెంగళూరు రూ.15,419, రూ.14,134
కేరళ రూ.15,419, రూ.14,134
ముంబై రూ.15,419, రూ.14,134
ఢిల్లీ రూ.15,434, రూ.14,149
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం