పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
ABN , Publish Date - May 19 , 2026 | 10:31 AM
నిన్న(సోమవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ధరలు నేడు భారీగా పెరిగాయి. నిన్న(సోమవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 750 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 610 రూపాయలు పెరిగింది.
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,57,040 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,950 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,780 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)
హైదరాబాద్: రూ.1,57,040
విజయవాడ: రూ.1,57,040
విశాఖపట్నం: రూ.1,57,040
ముంబై: రూ.1,57,040
బెంగళూరు: రూ.1,57,040
ఢిల్లీ: రూ.1,57,190
చెన్నై: రూ.1,62,220
సూరత్: రూ.1,57,190
మధురై: రూ.1,62,220
కోయంబత్తూరు: రూ.1,62,220
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి
కుప్పలుగా నోట్ల కట్టలు.. జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు