భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..
ABN , Publish Date - Mar 30 , 2026 | 10:53 AM
నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర 1,48,090 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర 1,35,750 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర 1,11,070 దగ్గర ట్రేడ్ అయింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. డాలర్ రేటు పెరగటం బంగారం ధరలు పతనమవ్వడానికి మరో కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతేడాది పెట్టుబడిదారులకు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చిన బంగారం.. ఇప్పుడు కంటతడి పెట్టిస్తోంది. యుద్ధం మొదలవ్వడానికి ముందు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1.90 లక్షల రూపాయల వరకు వెళ్లింది. యుద్ధం మొదలవ్వగానే బంగారం ధరలు ఢమాల్ అని పడిపోయాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా..
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర 1,48,090 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర 1,35,750 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర 1,11,070 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 24 క్యారెట్‌పై 810 రూపాయలు.. 22 క్యారెట్‌పై 750 రూపాయలు.. 18 క్యారెట్‌పై 610 రూపాయలు తగ్గింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో.. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర 1,47,280 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర 1,35,000 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర 1,10,460 దగ్గర ట్రేడ్ అవుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్)
హైదరాబాద్: రూ.1,47,280
అహ్మదాబాద్: రూ.1,47,330
విజయవాడ : రూ.1,47,280
ఢిల్లీ: రూ.1,47,430
ముంబై: రూ.1,47,280
వడోదర: రూ.1,47,280
కోల్‌కతా: రూ.1,47,280
చెన్నై: రూ.1,48,370
బెంగళూరు: రూ.1,47,280
కేరళ: రూ.1,47,280
పుణె: రూ.1,47,280
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి
ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది: డొనాల్డ్ ట్రంప్
మంత్రి పొంగులేటిని తక్షణమే బర్తరఫ్ చేయాలి: మధుసూదనాచారి