Share News

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..

ABN , Publish Date - Jun 03 , 2026 | 07:00 AM

బంగారం కొనాలనుకునే వారికి ఊరట కలిగించేలా గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు (బుధవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..
gold price today

ఇంటర్‌నెట్ డెస్క్: బంగారం కొనాలనుకునే వారికి ఊరట కలిగించేలా గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న(మంగళవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు (బుధవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది.


గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,210 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,190 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,160 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.


ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

  • హైదరాబాద్: రూ.1,56,210

  • అమరావతి: రూ.1,56,210

  • విజయవాడ: రూ.1,56,210

  • విశాఖపట్నం: రూ.1,56,210

  • రాజమండ్రి: రూ.1,56,210

  • అనంతపురం: రూ.1,56,210

  • వరంగల్: రూ.1,56,210

  • ఖమ్మం: రూ.1,56,210

  • కడప: రూ.1,56,210


వెండి ధరలు ఇలా..

బంగారం ధరల్లాగే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. నిన్న (మంగళవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 29 వేల రూపాయల వద్ద.. కేజీ వెండి 2,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు (బుధవారం) 100 గ్రాములపై 10 రూపాయలు.. కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 28,990 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,89,900 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఇవి కూడా చదవండి

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

114 రఫేల్స్‌ కావాలి!

Updated Date - Jun 03 , 2026 | 07:05 AM