దిగుమతి సుంకాల పెంపు.. ప్రముఖ జ్యూవెలరీ సంస్థల షేర్లు పతనం
ABN , Publish Date - May 13 , 2026 | 02:30 PM
బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో జ్యూవెలరీ సంస్థల షేర్లు పతనం అయ్యాయి. రాబోయే రోజుల్లో జ్యూవెలరీ సంస్థలపై ఒత్తిడి మరింత ఉండే ఛాన్స్ ఉందని మార్కెట్ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ఠాలను నమోదు చేస్తోంది. ఈ క్రమంలో దేశంలో కరెంట్ అకౌంట్ లోటు తీవ్రం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను పెంచింది. దీంతో, లోహాలకు డిమాండ్ తగ్గుతుందన్న అంచనాలు బలపడటంతో ప్రముఖ జ్యూవెలరీ సంస్థల షేర్లు నేడు పతనమయ్యాయి.
ఎన్‌ఎస్‌సీ సూచీలో టైటన్ కంపెనీ షేరు 1.43 శాతం మేర పతనమైంది. కల్యాణ్ జ్యూవెలరీ సంస్థ షేరు కూడా 5.40 శాతం మేర తగ్గింది. ఇక సెన్‌కో గోల్డ్ షేరు 0.56 శాతం మేర పతనం కాగా తంగమాయిళ్ జ్యూవెలరీ షేరు ధర 5 శాతం మేర తగ్గింది.
రాబోయే రోజుల్లో జ్యూవెలరీ రంగం షేర్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సోలార్ ప్యానెల్ కంపెనీలు, ఈఎమ్ఎస్ కంపెనీలపై కూడా ఓ మోస్తరు స్థాయిలో ప్రతికూల ప్రభావం ఉంటుందని అంటున్నారు. గోల్డ్ లోన్స్ ఇచ్చే కంపెనీలపై సానుకూల ప్రభావం ఉంటుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దిగుమతి సుంకాల పెంపుతో విదేశీ నిధుల తరలింపునకు బ్రేక్ పడి రూపాయి విలువ కొలుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
వామ్మో.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే..
ష్టాల్లో సూచీలు.. 4 రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఫట్