పసిడి అదే దూకుడు
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:48 AM
డాలర్ మారకంలో రూపాయు ఢమాల్‌మంటుంటే బంగారం, వెండి ధరలు మాత్రం జిగేల్‌మంటున్నాయి. ఈ రెండు విలువైన లోహాల ధరలు...
పసిడి అదే దూకుడు
10 గ్రాముల ధర రూ.1.60 లక్షలకు చేరువలో
ఒక్కరోజే రూ.6,500 పెరుగుదల
అదే బాటలో వెండి.. రూ.3.34 లక్షలకు కేజీ సిల్వర్
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయు ఢమాల్‌మంటుంటే బంగారం, వెండి ధరలు మాత్రం జిగేల్‌మంటున్నాయి. ఈ రెండు విలువైన లోహాల ధరలు బుధవారం మరో జీవితకాల గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్) పసిడి ధర రూ.6,500 (4.24 శాతం) పెరిగి రూ.1,59,700 స్థాయికి చేరిం ది. కిలో వెండి ధర కూడా రూ.11,300 పెరిగి రూ.3,34,300కు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ: అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరల ర్యాలీ కొనసాగుతోంది. బుధవారం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం 4,888.46 డాలర్లకు (సుమారు రూ.4.48 లక్షలు) చేరి రికార్డు సృష్టించింది. ఔన్స్ వెండి ధర 95.89 డాలర్ల రికార్డు స్థాయికి చేరిం ది. తాజా అంతర్జాతీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఔన్స్ పసిడి ధర త్వరలోనే 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
కారణాలు: సురక్షిత పెట్టుబడుల పేరుతో కొనసాగుతున్న భారీ కొనుగోళ్లు, ఈటీఎ్‌ఫల కొనుగోళ్లు ఈ రెండు లోహాల ర్యాలీకి ప్రధాన కారణమని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్ సంస్థ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. రూపాయి పతనం, పెట్టుబడుల డిమాండ్‌తో ప్రస్తుత దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే కొద్దిగా ప్రీమియంతో ట్రేడవుతున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి..
కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు
భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News