తగ్గిన పసిడి కొనుగోళ్లు
ABN , Publish Date - Sep 18 , 2026 | 02:59 AM
పండగల సీజన్ నగల వ్యాపారులకు పెద్దగా కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. ఆగస్టు చివరి వారంలో పుంజుకున్న అమ్మకాలు.. ఇటీవల బాగా తగ్గాయి.
ప్రపంచ స్వర్ణ మండలి
ముంబై: పండగల సీజన్ నగల వ్యాపారులకు పెద్దగా కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. ఆగస్టు చివరి వారంలో పుంజుకున్న అమ్మకాలు.. ఇటీవల బాగా తగ్గాయి. పసిడి ధరల్లో చోటు చేసుకుంటున్న తీవ్ర ఆటుపోట్లు ఇందుకు ప్రధాన కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. అయితే పండగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడే కొద్దీ డిమాండ్ పుంజుకుంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇన్వె్‌స్టమెంట్ డిమాండ్ కూడా ఇందుకు తోడయ్యే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ ఇండియా రీసెర్చ్ హెడ్ కవితా చాకో తెలిపారు.
అంతర్జాతీయ ధర కంటే తక్కువ: ప్రస్తుతం మన దేశంలో పసిడి ధర దిగుమతి ధర కంటే దాదాపు 2 శాతం తక్కువగా లభిస్తోంది. ఈ నెల 11వ తేదీ నాటికి దిగుమతిదారులు, ఔన్స్ (31.10 గ్రాములు) దేశీయ నగల వ్యాపారులకు అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే 78 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు కవిత తెలిపారు. స్మగ్లర్ల బంగారంతో పాటు పాత బంగారం మార్కెట్‌కు రావడమూ ఇందుకు దోహదం చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా డబ్బులు కట్ అయ్యాయా? ఇలా చేయండి