Share News

Gold and Silver Rates: వెండి, బంగారం.. తగ్గేదేలే.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:29 PM

బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. మంగళవారం మరింతగా పెరిగాయి. భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది.

Gold and Silver Rates: వెండి, బంగారం.. తగ్గేదేలే.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price

బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. మంగళవారం మరింతగా పెరిగాయి. భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.


ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 6న) మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,38,820కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే వెయ్యి రూపాయలకు పైగానే పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,250కి చేరింది (live gold rates). నిన్నటితో పోల్చుకుంటే రూ.1200లకు పైగా పెరిగింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,38,970కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,27,400కి చేరుకుంది.


మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది. సోమవారంతో పోల్చుకుంటే కిలోకు రూ.5వేల మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2.71 లక్షలకు చేరుకుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 2.53 లక్షలకు చేరింది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో.. ఈ మందు బాబు వీడియో చూడండి..


వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా సత్యసాయి బాబా భక్తురాలు..

Updated Date - Jan 06 , 2026 | 03:18 PM