Share News

పెరిగిన వెండి, బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ABN , Publish Date - Mar 10 , 2026 | 10:16 AM

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మంగళవారం యూటర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.

పెరిగిన వెండి, బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే
gold and silver rates today

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మంగళవారం యూటర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం వెండి కేజీకి రూ.10 వేల మేర పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా పెరుగుదల నమోదు చేసింది (Gold prices).


ఈ రోజు (మార్చి 10న) ఉదయం 10:00 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,62,380కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.700 మేర పెరుగుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,850 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.650 మేర పెరిగింది.


మరోవైపు వెండి కూడా పెరుగుదల నమోదు చేసింది. మంగళవారం కిలోకు రూ.10 వేల మేర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.90 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..


స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 10 , 2026 | 11:30 AM