మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Feb 09 , 2026 | 10:47 AM
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు సోమవారం మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. భారీ పెరుగుదల నమోదు చేశాయి. బంగారం గ్రాముకు రూ.200కు పైగా పెరిగింది. వెండి కిలోకు రూ.15000 మేర పెరిగింది.
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు సోమవారం మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. భారీ పెరుగుదల నమోదు చేశాయి. బంగారం గ్రాముకు రూ.200కు పైగా పెరిగింది. వెండి కిలోకు రూ.15 వేలు పెరిగింది (Gold prices Live).
ఈ రోజు (ఫిబ్రవరి 9న) ఉదయం 10:30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,58,840కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,240 రూపాయలు పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600కి చేరింది (Live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,050 రూపాయలు పెరిగింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,58,990కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,45,750కి చేరుకుంది.
ఇక, వెండి కూడా భారీ పెరుగుదల నమోదు చేసింది (Silver Rates Live). మళ్లీ రూ.3 లక్షల మార్క్‌కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ.15 వేలు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..