వెండి మరో రూ.20 వేలు తగ్గింది.. రూ.1400కు పైగా దిగొచ్చిన బంగారం..
ABN , Publish Date - Feb 03 , 2026 | 10:39 AM
బంగారం, వెండి ధరలు ప్రతిరోజు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వెండి ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా దిగి వస్తోంది. ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు ప్రతిరోజు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వెండి ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా దిగి వస్తోంది. ఇటీవలి కాలంలో ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరుగుతుండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది (Gold prices Live).
ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 3న) ఉదయం 10:30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,51,750కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,420 రూపాయలు తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,100కి చేరింది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,300 రూపాయలు తగ్గింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,51,900కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,39,250కి చేరుకుంది.
ఇక, పెట్టుబడిదారులకు వెండి భారీ నష్టాలను మిగుల్చుతోంది. ఇటీవల భారీగా పెరిగిన వెండి అంతే వేగంగా పతనమవుతోంది. ఐదు రోజుల క్రితం రూ.4.25 లక్షలకు చేరిన కిలో వెండి కొద్ది రోజుల్లోనే తిరిగి రూ.3 లక్షల దిగువకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.20 వేల మేర తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.8 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది.
ఇవి కూడా చదవండి..
హాస్పిటల్‌లో కాబోయే భర్త.. పెళ్లి కూతురి ఏడుపు.. పోలీసులు విచారణ చేస్తే..
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..