Gold, Silver Rates Jan 1: వరుసగా మూడో రోజూ తగ్గిన పసిడి రేట్లు.. నేటి ధరలివే..
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:52 AM
నూతన సంవత్సరంలో వినియోగదారులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరోసారి తగ్గాయి. ఈ వారంలో ధరలు తగ్గడం వరుసగా ఇది మూడో సారి. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సరంలో కాలుపెట్టిన తరుణంలో ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. ఈ వారం ధరల్లో కోత పడటం వరుసగా ఇది మూడోసారి. యూఎస్ డాలర్ బలపడటంతో పాటు ప్రాఫిట్ బుకింగ్ కొనసాగడంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం (జనవరి 1) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,488గా ఉంది. ఈ మూడు రోజుల్లో ధర సుమారు రూ.5 వేల మేర తగ్గడం గమనార్హం. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,23,640కు దిగొచ్చింది. వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,38,900గా ఉంది (Gold and Silver Rates Jan 1).
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర 4,364.70 డాలర్లుగా ఉంది. అయితే, గతేడాదిలో పసిడి ధర దాదాపు 66 శాతం మేర పెరిగింది. ఇక ఔన్స్ వెండి ధర 71.59 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఈ ఏడాది వెండి ధరలు దాదాపు 140 శాతం మేర పెరగడం గమనార్హం. అయితే, ధరలు తగ్గుతున్న వేళ జనాలు మళ్లీ గోల్డ్ పెట్టుబడుల వైపు మళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫ్రధాన నగరాల్లో పసిడి (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,36,140; ₹1,24,790; ₹1,04,090
ముంబై: ₹1,34,880; ₹1,23,640; ₹1,01,160
దిల్లీ: ₹1,35,030; ₹1,23,790; ₹1,01,320
కొల్కతా: ₹1,34,880; ₹1,23,640; ₹1,01,160
బెంగళూరు: ₹1,34,880; ₹1,23,640; ₹1,01,160
హైదరాబాద్: ₹1,34,880; ₹1,23,640; ₹1,01,160
విజయవాడ: ₹1,34,880; ₹1,23,640; ₹1,01,160
కేరళ: ₹1,34,880; ₹1,23,640; ₹1,01,160
పుణె: ₹1,34,880; ₹1,23,640; ₹1,01,160
వడోదరా: ₹1,34,930; ₹1,23,690; ₹1,01,210
అహ్మదాబాద్: ₹1,34,930; ₹1,23,690; ₹1,01,210
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹2,56,900
ముంబై: ₹2,38,900
న్యూఢిల్లీ: ₹2,38,900
కోల్‌కతా: ₹2,38,900
బెంగళూరు: ₹2,38,900
హైదరాబాద్: ₹2,56,900
విజయవాడ: ₹2,56,900
కేరళ: ₹2,56,900
పుణె: ₹2,38,900
వడోదరా: ₹2,38,900
అహ్మదాబాద్: ₹2,38,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. కొనుగోలుదారులు మరోసారి ధరలను పరిశీలించగలరు.
స్టాక్ మార్కెట్ సంపదలో రూ.30 లక్షల కోట్ల వృద్ధి
2026లో రూ.4 లక్షల కోట్ల ఐపీఓలు