Indian Stock Market Wealth: స్టాక్ మార్కెట్ సంపదలో రూ.30 లక్షల కోట్ల వృద్ధి
ABN , Publish Date - Dec 31 , 2025 | 03:51 AM
ఈ సంవత్సరంలో స్టాక్ మార్కె ట్ వర్గాల సంపద రూ.30.20 లక్షల కోట్ల మేర పెరిగింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.471.72 లక్షల కోట్లుగా......
2025లో సెన్సెక్స్ 8 శాతం అప్
ముంబై: ఈ సంవత్సరంలో స్టాక్ మార్కె ట్ వర్గాల సంపద రూ.30.20 లక్షల కోట్ల మేర పెరిగింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.471.72 లక్షల కోట్లుగా (5.24 లక్షల కోట్ల డాలర్లు) నమోదైంది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ, అమెరికా వాణిజ్య సుంకాల పోటు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతుండటం, రూపాయి క్షీణత, కార్పొరేట్ల ఆదాయ వృద్ధిలో స్తబ్ధత వంటి పలు సవాళ్ల నేపథ్యంలో సైతం ఈక్విటీ సూచీలు వృద్ధి పథంలోనే పయనించాయి. 2024 రాబడులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, ఈ ఏడాదిలో సెన్సెక్స్ 6,556.53 పా యింట్లు (8.39ు) బలపడింది. నిఫ్టీ కూడా 2,000 పాయింట్లకు (9ు) పైగా పెరిగింది. మార్కెట్లో దేశీయ మదుపరుల పెట్టుబడులు గణనీయంగా పెరగడం, దేశ ఆర్థిక స్థిరత్వం, బలమైన జీడీపీ వృద్ధి వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
మరిన్ని విషయాలు..
ఈ ఏప్రిల్‌లో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ తొలిసారిగా రూ.400 లక్షల కోట్ల మైలురాయికి చేరింది.
ఈ సంవత్సరం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మన మార్కెట్ నుంచి ఏకంగా రూ.1.6 లక్షల కోట్ల (1800 కోట్ల డాలర్లు) పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
2025 ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫరింగ్) నామ సంవత్సరంగా మారింది. 103 పెద్ద కంపెనీలు, 270 ఎస్‌ఎంఈలు (మొత్తం 373 ఐపీఓలు) కలిసి ప్రైమరీ మార్కెట్ నుంచి మొత్తం రూ.1.95 లక్షల కోట్లు సమీకరించాయి. అందులో ప్రధాన కంపెనీలు సమీకరించిన నిధుల (రూ.1.76 లక్షల కోట్లు) వాటాయే 94 శాతంగా ఉంది.
స్వల నష్టాల్లో ముగింపు
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ఏడాది చివరిలో స్తబ్దత కారణంగా ఈక్విటీ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ మరో 20.46 పాయింట్లు కోల్పోయి 84,675.08 వద్ద, నిఫ్టీ 3.25 పాయింట్ల నష్టంతో 25,938.085 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ గడిచిన ఐదు రోజుల్లో 892.4 పాయింట్లు నష్టపోయింది.