తగ్గేదేలే.. రూ. 2 లక్షల దిశగా బంగారం.. రూ.4 లక్షలు దాటేసిన వెండి..
ABN , Publish Date - Jan 29 , 2026 | 07:00 PM
బంగారం, వెండి ధరలు రోజూ సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుని కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి..
బంగారం, వెండి ధరలు రోజూ సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుని కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.8 లక్షల మార్కును దాటేసి రూ. 2 లక్షల దిశగా పరుగులు పెడుతోంది. అటు వెండి ధర కూడా కిలో రూ. 4 లక్షల మైలురాయిని దాటింది (gold price today Hyderabad).
ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,82,490గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,950గా ఉంది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,80,135గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,100గా ఉంది. ఇక, మరికొద్ది రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రెండు లక్షలు దాటేస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి (24 carat gold rate today).
మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది (silver price today Hyderabad). కిలో వెండి ధర రూ.4 లక్షలు దాటేసింది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధర కిలోకు 30 వేల మేరకు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.4,25,000గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 4,10,000గా ఉంది. ఈ ఏడాదిలో బంగారం ధరలు ఏకంగా 79 శాతం పెరిగాయి. మరోవైపు వెండి ఏడాదిలో ఏకంగా 243 శాతం పెరిగింది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..
యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..