రూ.3,000 కోట్ల ఏయూఎం లక్ష్యం: గోద్రెజ్ వెల్త్
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:07 AM
గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ గోద్రెజ్ వెల్త్.. హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దక్షిణాది మార్కెట్లోకి అడుగు పెట్టాలన్న...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ గోద్రెజ్ వెల్త్.. హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దక్షిణాది మార్కెట్లోకి అడుగు పెట్టాలన్న లక్ష్యంతో గురువారం నాడిక్కడ హైదరాబాద్‌లో గోద్రెజ్ వెల్త్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ, సీఈఓ మనీష్ షా తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో వెల్త్ విభాగాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, పుణె నగరాల్లో సేవలందిస్తోందన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 20 వేల అలా్ట్ర హైనెట్‌వర్త్ కుటుంబాలు ఉన్నాయని, ఇది భారత అలా్ట్ర నెట్‌వర్త్ కుటుంబాల్లో 6.3 శాతమని ఆయన పేర్కొన్నారు. జూన్‌లో గోద్రెజ్ వెల్త్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.1,000 కోట్లకు చేరిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే నాటికి దీన్ని రూ.3,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.5 కోట్లు అంతకు పైబడి పెట్టుబడులు పెట్టే అలా్ట్ర, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐ, హెచ్‌ఎన్‌ఐ)కు వారి వ్యూహాలు, అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ కార్యాలయం సేవలు అందిస్తుందని మనీష్ షా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు