బ్లేజ్ ఆటోమేషన్తో జీఓసీఎల్ జట్టు
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:25 AM
హిందుజా గ్రూప్‌నకు చెందిన జీఓసీఎల్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఐఓటీ రంగంలో ఒరిజినల్ డిజైన్ మాన్యుఫ్యాక్చరర్ అయిన...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హిందుజా గ్రూప్‌నకు చెందిన జీఓసీఎల్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఐఓటీ రంగంలో ఒరిజినల్ డిజైన్ మాన్యుఫ్యాక్చరర్ అయిన బ్లేజ్ ఆటోమేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో పారిశ్రామిక, ఆటోమోటివ్, రక్షణ, ఈ-మొబిలిటీ రంగాలలో ప్రొడక్ట్ కో-డెవల్‌పమెంట్, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, భారీ స్థాయి తయారీ, సప్లయ్ చెయిన్ సహకారంపై దృష్టి సారించనున్నాయి. ఈ భాగస్వామ్యంతో భారత, అంతర్జాతీయ కస్టమర్లకు సమీకృత ఎలక్ర్టానిక్ డిజైన్, తయారీ సేవలను ఇరు సంస్థలు అందించనున్నాయి.
ఇవి కూడా చదవండి...
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News